ఇది సినిమా షూటింగ్‌ కాదు | NO FILE SHOOTING | Sakshi
Sakshi News home page

ఇది సినిమా షూటింగ్‌ కాదు

Sep 16 2016 9:03 PM | Updated on Aug 21 2018 6:10 PM

ఇది సినిమా షూటింగ్‌ కాదు - Sakshi

ఇది సినిమా షూటింగ్‌ కాదు

గైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఎదురుగా .. 16వ నంబరు జాతీయ రహదారిపై కార్లు, పోలీసులు, జనం. ఇదేదో సినిమా షూటింగ్‌ అని ఆగిన ప్రయాణికులతో ఆప్రాంతం జనసంద్రమైంది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ హడావుడి ఏమిటో అని ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉన్న విద్యార్థులు కూడా అక్కడకు వచ్చారు.

వెలుగుబంద (రాజానగరం) : గైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఎదురుగా .. 16వ నంబరు జాతీయ రహదారిపై కార్లు, పోలీసులు, జనం. ఇదేదో సినిమా షూటింగ్‌ అని ఆగిన ప్రయాణికులతో ఆప్రాంతమంతా ఒక్కసారిగా జనసంద్రమైంది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ హడావుడి ఏమిటో అని ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉన్న విద్యార్థులు కూడా అక్కడకు వచ్చారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి రెండు చిన్న కార్లలో భారీగా తరలిపోతున్న గంజాయిని రాజానగరం పోలీసులు స్వాధీనపర్చుకున్నారు.

ఆ రవాణాకు సంబంధం ఉన్న కొంతమంది వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. రికార్డ్ పరంగా వాటిని చూపించడం కోసం ఫొటోలు, వీడియో తీసేందుకు పట్టుకున్న కార్లు, నిందితులతో  పై స్పాట్‌లో పోలీసులు చేసిన హంగామా సినిమా షూటింగ్‌ని తలపించింది. సుమారు 70 గంజాయి ప్యాకెట్లును స్వాధీనపర్చుకుని తొమ్మిది మంది నిందుతులను అదుపులోకి తీసుకున్నట్టు విశ్వశనీయ సమాచారం.  కాగా ఆ వివరాలను ప్రస్తుతానికి పోలీసులు గోప్యంగా ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement