ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు పెట్టుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు.
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు పెట్టుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. గురువారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు విభజనపై తెలంగాణ న్యాయవాదులు అనవసర రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు.
కేంద్ర పరిధిలో హైకోర్టు విభజన ఉందనే ఉద్దేశంతో ఢిల్లీలో ధర్నా చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కేఈ అన్నారు.