పశువుల అక్రమ రవాణాపై నిఘా | nigha on cattle transport | Sakshi
Sakshi News home page

పశువుల అక్రమ రవాణాపై నిఘా

Aug 1 2016 8:01 PM | Updated on Aug 14 2018 3:37 PM

పశువుల అక్రమ రవాణాపై నిఘా - Sakshi

పశువుల అక్రమ రవాణాపై నిఘా

జంగారెడ్డిగూడెం రూరల్‌ : జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పశువుల సంతపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని జంతు నివారణ జిల్లా సంస్థ ఎగ్జిక్యూటివ్‌ కార్యదర్శి ఎన్‌సీహెచ్‌ భాను అన్నారు.

జంగారెడ్డిగూడెం రూరల్‌ : జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పశువుల సంతపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని జంతు నివారణ జిల్లా సంస్థ ఎగ్జిక్యూటివ్‌ కార్యదర్శి ఎన్‌సీహెచ్‌ భాను అన్నారు. సోమవారం జంగారెడ్డిగూడెం మార్కెట్‌ యార్డులో జరుగుతున్న సంత తీరును ఎస్సై ఎ.ఆనందరెడ్డితో కలిసి భాను పరిశీలించారు. గత నెల 25న ‘పాపం పశువులు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తపై ఆయన స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రాలకు చెందిన లారీల్లో గోవుల అక్రమ రవాణాను ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటూ ర్యాంపు వద్ద సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ భాను మార్కెట్‌ యార్డు సిబ్బంది ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశించిన నిబంధనలు ఎక్కడా కానరావడం లేదన్నారు. ర్యాంపు సీసీ కెమెరాల లేవని, షెడ్లు, మంచినీరు వంటి సదుపాయాలు కూడా లేవని భాను తెలిపారు. పరిశీలన నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్టు చెప్పారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement