పోలీసులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా పూలబొకేలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీ.
అనంతపురం సెంట్రల్ : పోలీసులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా పూలబొకేలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీ. ఈఏడాది మాత్రం అందుకు భిన్నంగా మొక్కలు అందించి, జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖరబాబుకు శుభాకాంక్షలు చెప్పారు. వర్షాభావం ఉన్న అనంతపురం జిల్లాలో మొక్కలు నాటడడంతో ద్వారానే ‘ హరిత అనంత’గా మారుతుందనే ఉద్దేశాన్ని తీసుకుపోయేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆదివారం ఉదయం పోలీసు అధికారులు ఎస్పీ కార్యాలయానికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని జిల్లా ప్రజలు ప్రశాంతంగా జీవించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు మల్లికార్జునవర్మ, మల్లికార్జున, గంగయ్య, సీఐ రాజశేఖర్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పోలీసు అధికారుల సంఘం కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ఏఎస్పీ మల్యాద్రి హాజరై కేక్ కట్ చేశారు.