రూ. 1200 కోట్లతో రోడ్లకు మహర్దశ | new roads with 1,200crore project | Sakshi
Sakshi News home page

రూ. 1200 కోట్లతో రోడ్లకు మహర్దశ

Mar 25 2016 2:11 AM | Updated on Aug 30 2018 4:49 PM

రూ. 1200 కోట్లతో రోడ్లకు మహర్దశ - Sakshi

రూ. 1200 కోట్లతో రోడ్లకు మహర్దశ

జిల్లాలో రూ.1200 కోట్లతో రోడ్లను విస్తరించనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
మోమిన్‌పేట : జిల్లాలో రూ.1200 కోట్లతో రోడ్లను విస్తరించనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని మేకవనంపల్లిలో నందివాగుపై రూ.1.25 కోట్లతో ఏర్పాటు చేయనున్న బ్రిడ్జి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో రోడ్ల విస్తరణకు మంజూరైన నిధుల్లో అత్యధికంగా వికారాబాద్ నియోజకవర్గానికి కేటాయించినట్లు ఆయన వివరించారు.  ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరాచేస్తామని చెప్పా రు. రెండేళ్లలో జిల్లా ప్రజలకు ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరావు, సర్పంచ్ శంకర్, ఎంపీపీ నిఖితారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మమ్మ, మార్కెటు కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు నరోత్తంరెడ్డి, అంజిరెడ్డి, పీఆర్ డిప్యూటీ ఈఈ విఠల్, ఎఈఈ శ్రీనివాస్, తహసీల్దార్ విజయకుమారి, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ శాంత తదితరులు పాల్గొన్నారు.

 సమస్యలు పరిష్కరిస్తా..
లారీ యాజమానుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో తెలంగాణ లారీ యజమానుల అసోసియేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. పనిచేసే ప్రతిఒక్కరూ సంఘంగా ఏర్పడి హక్కులను సాధించుకోవాలన్నారు. రికార్డులు అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే ప్రభుత్వానికి రావాల్సి ఆదాయాన్ని గండి కొడితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించేది లేదని మంత్రి పేర్కొన్నారు. అంతకు ముందు మండల కేంద్రం లోని సంగమేశ్వర ఫర్టిలైజర్స్ దుకాణం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరావు, లారీ యజమానుల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సభ్యులు వెంకట్‌రెడ్డి, మల్లారెడ్డి, సర్పంచు వడ్ల చంద్రయ్య, ఎంపీటీసీ సభ్యులు ప్రభు, భాస్కర్, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు నరోత్తంరెడ్డి, సమద్, శ్రీనివాస్‌రెడ్డి,అనందం, మహంత్‌స్వామి, అంజిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement