ముగిసిన నవరాత్రి ఉత్సవాలు | navarathri festival closed | Sakshi
Sakshi News home page

ముగిసిన నవరాత్రి ఉత్సవాలు

Oct 9 2016 7:43 PM | Updated on Oct 1 2018 6:33 PM

ముగిసిన నవరాత్రి ఉత్సవాలు - Sakshi

ముగిసిన నవరాత్రి ఉత్సవాలు

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలోని శివాలయంలో గత 9 రోజులుగా నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి.

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలోని శివాలయంలో గత 9 రోజులుగా నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు పూర్ణాహుతిని నిర్వహించారు. ఉదయం అమ్మ వారిని దుర్గా సూక్తంతో అభిషేకించి, పట్టు పీతాంబరాలతో అలంకారం చేసి దుర్గా దేవీగా అలంకరించిన అనంతరం సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి హవనం చేసి నవరాత్రి ఉత్సవాలకు ముగింపు పలికారు. 
తగ్గిన భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. దీంతో ఆలయ పరిసరాలు, గర్భాలయం, క్యూలైన్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. దేవస్థానానికి వివిధ విభాగాల నుంచి రూ. 6,32,948 ల ఆదాయం వచ్చినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement