నార్బో పర్వతాన్ని అధిరోహించిన జిల్లావాసులు | Narbo mountain climb by the district residents | Sakshi
Sakshi News home page

నార్బో పర్వతాన్ని అధిరోహించిన జిల్లావాసులు

Jun 3 2016 10:23 AM | Updated on Oct 17 2018 6:06 PM

తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడుగురు సభ్యుల బృందం హిమాచల్‌ప్రదేశ్‌లోని నార్బో పర్వతాన్ని అధిరోహించారు.

నిజామాబాద్‌అర్బన్: తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడుగురు సభ్యుల బృందం హిమాచల్‌ప్రదేశ్‌లోని నార్బో పర్వతాన్ని అధిరోహించారు. 5,226 అడుగుల ఎత్తున ఉన్న పర్వతంపైకి అధిరోహించి జాతీయ జెండాను, తెలంగాణ జాగృతి జెండాను ఎగురవేశారు. ఈ బృందంలో నిజామాబాద్‌కు చెందిన ఎం.విశాల్‌శర్మ, నితిన్‌రావులు ఉన్నారు. వీరికి ఎంపీ కవిత ఆర్థిక సహాయం అందజేశారు. పర్వతాన్ని అధిరోహించి జిల్లా ఖ్యాతిని చాటిన వీరిని ఆమె అభినందించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement