breaking news
narbo mountain
-
నార్బో పర్వతాన్ని అధిరోహించిన జిల్లావాసులు
నిజామాబాద్‌అర్బన్: తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడుగురు సభ్యుల బృందం హిమాచల్‌ప్రదేశ్‌లోని నార్బో పర్వతాన్ని అధిరోహించారు. 5,226 అడుగుల ఎత్తున ఉన్న పర్వతంపైకి అధిరోహించి జాతీయ జెండాను, తెలంగాణ జాగృతి జెండాను ఎగురవేశారు. ఈ బృందంలో నిజామాబాద్‌కు చెందిన ఎం.విశాల్‌శర్మ, నితిన్రావులు ఉన్నారు. వీరికి ఎంపీ కవిత ఆర్థిక సహాయం అందజేశారు. పర్వతాన్ని అధిరోహించి జిల్లా ఖ్యాతిని చాటిన వీరిని ఆమె అభినందించారు. -
నార్బో పర్వతంపై ఆవిర్భావ సంబరాలు
♦ తోటి సభ్యులతో కలిసి అంగోత్ తుకారాం జాతీయ జెండా ఆవిష్కరణ ♦ జాతీయ జెండావిష్కరణలో తుకారాం, సభ్యులు యాచారం: నార్బో పర్వతంపై గురువారం జరిగిన తెలంగాణ సంబరాల్లో తక్కళ్లపల్లి తండాకు చెందిన అంగోత్ తుకారాం పాల్గొన్నాడు. అడ్వంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ సంస్థ ఏడుగురి బృందంతో కూడిన సభ్యులను పర్వతంపై సంబరాలకు ప్లాన్ చేసింది. ఆ బృం దంలో తుకారాం కూడా ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావ సంబరాల్లో భాగంగా గురువారం ఉదయం 8:30 గంటలకు భూమికి 5,226 అడుగుల ఎత్తులో ఉన్న నార్బో పర్వతంపై జాతీయ జెండా ఆవిష్కరణలో తుకారాం పాల్గొన్నాడు. టీం సభ్యులతో కలిసి అక్కడే బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సంబరాలను నార్బో పర్వతంపై జరుపుకోవడంలో తాను సభ్యుడిగా ఉన్నందుకు సంతోషంగా ఉందని ‘సాక్షి’కి తెలిపాడు. టీం మేనేజరు కె.రంగయ్య, లైజన్ ఆఫీసర్ విజయలక్ష్మిల ఆధ్వర్యంలో పర్వతారోహణం చేసినట్లు తుకారాం తెలిపాడు. -
నార్బో పర్వతంపై తెలంగాణ సంబురాలు
నేటి ఉదయం 8:30 గంటలకు శిఖరంపైకి చేరుకోనున్న ఔత్సాహికులు అక్కడే తెలంగాణ ఆవిర్భావ వేడుకలు... బతుకమ్మ ఆటలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: స్వరాష్ట్ర సాధన ఉత్సవాలను అందరిలాగా సాదాసీదాగా జరుపుకోకూడదనుకున్నారో.. ఏమో కొందరు ఔత్సాహికులు ఏకంగా ఓ పర్వత శిఖరాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఎవరికీ అందనంత ఎత్తులో తమ సంతోషాన్ని పంచుకోవాలని, బతుకమ్మ ఆటలు ఆడుకుని తెలంగాణ సంస్కృతిని ఎవరెస్టు శిఖరం ఎత్తుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో సాహసమే అయినా ముందుకు కది లారు. వారికి కొందరు దాతలు అండగా ఉండడంతో క్షేమంగా హిమాచల్ ప్రదేశ్‌లోని నార్బో పర్వతం అంచుల వరకు వెళ్లారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ఉదయం 8: 30 గంటల ప్రాంతంలో వారు ఈ పర్వతంపైకి చేరుకుని అక్కడే సంబురాలు జరుపుకోనున్నారు. వివరాల్లోకి వెళితే...అడ్వంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ అనే ఓ సంస్థ ఈ పర్వత సంబురాలకు ప్లాన్ చేసింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను భూమి మీద జరుపుకోవడం కన్నా పర్వతాల మీద జరుపుకోవాలన్న ఆలోచనతో 8 మంది సభ్యుల బృందం మే నెలలో హైదరాబాద్ నుంచి హిమాచల్ ప్రదేశ్ బయలుదేరింది. అక్కడ భూమికి 5,226 అడుగుల ఎత్తులో ఉన్న నార్బో పర్వత ఆరోహణ ప్రారంభించింది. బుధవారం రాత్రి కల్లా నార్బో పర్వత శిఖరానికి అంచున ఫైనల్ సమ్మిట్ క్యాంపులో 600 అడుగుల దూరంలో ఉందని టీం లైజన్ ఆఫీసర్ ఐ.విజయలక్ష్మి తెలిపారు. బృందం సభ్యులంతా క్షేమంగా ఉన్నారని, వీరంతా జూన్2 ఉదయం 8:30 గంటలకు పర్వత శిఖరానికి చేరుకుని అక్కడే తెలంగాణ సంబురాలు జరుపుకుని, బతుకమ్మ ఆడుతారని ఆమె ‘సాక్షి’కి వెల్లడించారు. అడ్వంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ మేనేజర్ కె. రంగారావు ఈ టీంకు నేతృత్వం వహిస్తుండగా, ఈ బృందంలో ఎ. సత్యనారాయణ (మహాత్మాగాంధీ యూనివర్సిటీ, నల్లగొండ), ప్రవీణ్ కుమార్ (నారాయణఖేడ్, మెదక్), రాజశేఖర్ నాయక్ (తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్), ఎం. విశాల్‌శర్మ (నిజామాబాద్), ఎ. తుకారామ్ ( తక్కెళ్లపల్లి తండా, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా), సుధీర్‌సింగ్ (ధూల్‌పేట, హైదరాబాద్), టి. నితిన్‌రావు (నిజామాబాద్)లు సభ్యులుగా ఉన్నారు. అయితే, ఈ టీంకు నల్లగొండ జిల్లా ఎస్పీగా పనిచేసి ఇటీవలే ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ అయిన విక్రమ్‌జీత్ దుగ్గల్ సాయమందించడం గమనార్హం.