నార్బో పర్వతంపై ఆవిర్భావ సంబరాలు | telangana formation day celebrations on Narbo mountain | Sakshi
Sakshi News home page

నార్బో పర్వతంపై ఆవిర్భావ సంబరాలు

Jun 3 2016 12:15 AM | Updated on Mar 28 2018 11:26 AM

నార్బో పర్వతంపై ఆవిర్భావ సంబరాలు - Sakshi

నార్బో పర్వతంపై ఆవిర్భావ సంబరాలు

నార్బో పర్వతంపై గురువారం జరిగిన తెలంగాణ సంబరాల్లో తక్కళ్లపల్లి తండాకు చెందిన అంగోత్ తుకారాం పాల్గొన్నాడు.

తోటి సభ్యులతో కలిసి అంగోత్ తుకారాం జాతీయ జెండా ఆవిష్కరణ
జాతీయ జెండావిష్కరణలో తుకారాం, సభ్యులు

యాచారం: నార్బో పర్వతంపై గురువారం జరిగిన తెలంగాణ సంబరాల్లో తక్కళ్లపల్లి తండాకు చెందిన అంగోత్ తుకారాం పాల్గొన్నాడు. అడ్వంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ సంస్థ ఏడుగురి బృందంతో కూడిన సభ్యులను పర్వతంపై సంబరాలకు ప్లాన్ చేసింది. ఆ బృం దంలో తుకారాం కూడా ఉన్నారు.

  తెలంగాణ ఆవిర్భావ సంబరాల్లో భాగంగా గురువారం ఉదయం 8:30 గంటలకు భూమికి 5,226 అడుగుల ఎత్తులో ఉన్న నార్బో పర్వతంపై జాతీయ జెండా ఆవిష్కరణలో తుకారాం పాల్గొన్నాడు. టీం సభ్యులతో కలిసి అక్కడే బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సంబరాలను నార్బో పర్వతంపై జరుపుకోవడంలో తాను సభ్యుడిగా ఉన్నందుకు సంతోషంగా ఉందని ‘సాక్షి’కి తెలిపాడు. టీం మేనేజరు కె.రంగయ్య, లైజన్ ఆఫీసర్ విజయలక్ష్మిల ఆధ్వర్యంలో పర్వతారోహణం చేసినట్లు తుకారాం తెలిపాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement