నాగిరెడ్డిపేటను ‘మెదక్‌’లో కలపాలి | nagireddypeta to merge in medak district | Sakshi
Sakshi News home page

నాగిరెడ్డిపేటను ‘మెదక్‌’లో కలపాలి

Oct 4 2016 7:46 PM | Updated on Sep 4 2017 4:09 PM

నిజామాబాద్‌ జిల్లాలో కొనసాగుతున్న నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్‌ జిల్లాలో కలపాలని డిమాండ్‌ చేస్తూ నాగిరెడ్డిపేట గ్రామస్తులు మంగళవారం పోచమ్మరాల్‌ గ్రామంలో నిరాహర దీక్షలు చేపట్టారు.

పోచమ్మరాలో నిరాహార దీక్షలు ప్రారంభించిన గ్రామస్తులు

మెదక్‌ రూరల్‌: ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లాలో కొనసాగుతున్న నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్‌ జిల్లాలో కలపాలని డిమాండ్‌ చేస్తూ నాగిరెడ్డిపేట గ్రామస్తులు మంగళవారం మెదక్‌ మండలం పోచమ్మరాల్‌ గ్రామంలో నిరాహర దీక్షలు చేపట్టారు. నాగిరెడ్డిపేటను దగ్గరలో ఉన్న మెదక్‌లో కాకుండా కామారెడ్డిలో చేర్చాలనే ప్రభుత్వ ముసాయిదాను వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా ఉద్యమాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.  కార్యక్రమంలో నర్సింహారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, జయరాజ్, వాసురెడ్డి, బాపురెడ్డి, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement