
భక్తిశ్రద్ధలతో నాగపంచమి
జిల్లా అంతటా భక్తిశ్రద్ధలతో నాగ పంచమిని ఆదివారం జరుపుకున్నారు.
అనంతపురం కల్చరల్ : జిల్లా అంతటా భక్తిశ్రద్ధలతో నాగ పంచమిని ఆదివారం జరుపుకున్నారు. శ్రావణమాసంలో వచ్చిన తొలిపండుగ కావడంతో ఉదయం నుంచే పలు ఆలయాల్లోనూ, నాగుల పుట్టల వద్ద మహిళలు బారులుదీరి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతపురం నగర సమీపంలోని చెరువుకట్టపై వెలసిన నాగేంద్రుడికి, నగర శివారులోని శివకోటిలో నాగపంచమి వేడుకలు నిర్వహించారు. అలాగే హెచ్చెల్సీ కాలనీలోని వల్లి,దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడికి మఠం బసవరాజ స్వామి ఆధ్వర్యంలో గరుడ పంచమి వేడుకలు నియమనిష్టలతో జరిగాయి.