పుష్కరాలు ముగిసేంత వరకు అప్రమత్తం | Must have to attention upto puskaras ending | Sakshi
Sakshi News home page

పుష్కరాలు ముగిసేంత వరకు అప్రమత్తం

Aug 17 2016 9:32 PM | Updated on Sep 4 2017 9:41 AM

కృష్ణా పుష్కరాలకు భక్తులు అధికంగా తరలివస్తున్నారని, భక్తులకు ఇబ్బంది కలుగకుండా పుష్కరాలు ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని జిల్లా రూరల్‌ ఎస్పీ కె. నారాయణ నాయక్‌ పోలీసులకు సూచించారు.

 రూరల్‌ ఎస్పీ నారాయణ్‌ నాయక్‌
 
పొందుగల (దాచేపల్లి): కృష్ణా పుష్కరాలకు భక్తులు అధికంగా తరలివస్తున్నారని, భక్తులకు ఇబ్బంది కలుగకుండా పుష్కరాలు ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని జిల్లా రూరల్‌ ఎస్పీ కె. నారాయణ నాయక్‌ పోలీసులకు సూచించారు. మండలంలోని పొందుగల పుష్కరఘాట్‌ను బుధవారం ఆయన సందర్శించారు. ఘాట్‌లో భక్తులు స్నానాలు చేసే ప్రదేశాలను పరిశీలించారు. ఘాట్ల వద్ద ఏర్పాట్లు పట్ల ఆయన సంతప్తి వ్యక్తం చేశారు. మరో ఆరురోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయని, సెలవు దినాల్లో, పుష్కరాల చివరి రెండు రోజుల్లో భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఎస్పీ చెప్పారు.  భక్తులు పుష్కరస్నానం చేసి క్షేమంగా ఇంటికి వెళ్లేలా చూడాలని, ఆటంకాలు కలుగకుండా భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఇ. శ్రీనివాసరావు, ఎస్‌ఐ కట్టా ఆనంద్, ఎంపీపీ అంబటి నవకుమార్, డీసీ చైర్మన్‌ నర్రా పుల్లయ్య తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement