అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ అరెస్ట్

సాక్షి, హైదరాబాద్: ఈస్ట్ జోన్‌లో అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్‌ను పోలీసు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశామని.. వారి నుంచి సుమారు రూ. 12 లక్షల రూపాయల నగదును స్వాదీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసులో అబిద్ మోహినుద్దీన్, షేక్ అబ్దుల్ బాసిత్, సంబరం రాజేష్‌లను అరెస్ట్ చేశామన్నారు. రాజేష్ కుమార్ బగడియా అనే వ్యక్తిని ఈ ముఠా మోసం చేసిందని పేర్కొన్నారు. పాత నోట్లను మార్పిడి చేస్తామంటూ.. రాజేష్‌ను నమ్మించారని చెప్పారు. రెండు రోజుల్లో ఈస్ట్ జోన్ పోలీసులు ఈ కేసును చేధించారని సీపీ పేర్కొన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి