జిల్లాలోని అన్ని పీహెచ్‌సీ ల్లో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పిస్తూ నెల కు కనీసం 11 ప్రసవాలు నిర్వహించే విధంగా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. శనివారం కలెక్టరేట్ నుంచి పీహెచ్‌సీల వైద్యులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
-
నెలకు కనీసం 11 ప్రసవాలు నిర్వహించాలి
-
గర్భిణుల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచాలి
-
కలెక్టర్ వాకాటి కరుణ
హన్మకొండ అర్బన్ : జిల్లాలోని అన్ని పీహెచ్‌సీ ల్లో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పిస్తూ నెల కు కనీసం 11 ప్రసవాలు నిర్వహించే విధంగా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. శనివారం కలెక్టరేట్ నుంచి పీహెచ్‌సీల వైద్యులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణులకు సంబంధించిన ఫోన్‌నెంబర్లు సేకరించి అందుబాటులో ఉంచాలని సూచించారు. కమిటీ ఆ మోదంతో ఆస్పత్రి అభివృద్ధి నిధుల నుంచి అ వసరమైన కొత్త సామాగ్రిని కొనుగోలు చేయాల ని ఆదేశించారు. అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌వో శ్రీరాం మాట్లాడుతూ ఆస్పత్రుల్లో సౌకర్యాల క ల్పనకోసం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అన్ని విభాగాల్లో ఉత్తమ పీహెచ్‌సీకి రూ.2 లక్షలు, రెండవ స్థానంలో ఉన్న పీహెచ్‌సీ కి రూ.50 వేల చొప్పున నగదు పారితోషికం అందజేయనున్నట్లు తెలిపారు.