హేలాపురిలో హత్యా సంస్కృతి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా రాజధాని ఏలూరు(హేలాపురి) మరోసారి ఉలిక్కిపడింది. గురువారం రౌడీషీ టర్ దారుణ హత్యతో నగరంలో కలకలం రేగిం ది. ప్రశాంత వాతావరణానికి నెలవైన జిల్లా కేం ద్రం ఏడాదిగా హత్యాసంస్కృతితో రగులుతోం ది. ఈఏడాదిలో ఇప్పటివరకూ ఇద్దరు దారుణ హత్యకు గురికావడం, మరో ఇద్దరిపై హత్యా యత్నాలు జరగడం స్థానికులను కలవరానికి గురిచేస్తోంది. వీటన్నింటి వెనుక రాజకీయ నేతల హస్తం ఉండటం ఆందోళన కలిగిస్తోంది
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా రాజధాని ఏలూరు(హేలాపురి) మరోసారి ఉలిక్కిపడింది. గురువారం రౌడీషీ టర్ దారుణ హత్యతో నగరంలో కలకలం రేగిం ది. ప్రశాంత వాతావరణానికి నెలవైన జిల్లా కేం ద్రం ఏడాదిగా హత్యాసంస్కృతితో రగులుతోం ది. ఈఏడాదిలో ఇప్పటివరకూ ఇద్దరు దారుణ హత్యకు గురికావడం, మరో ఇద్దరిపై హత్యా యత్నాలు జరగడం స్థానికులను కలవరానికి గురిచేస్తోంది. వీటన్నింటి వెనుక రాజకీయ నేతల హస్తం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఏడాదిలో ఘాతుకాలు ఇవీ..
l– జనవరి 8న స్థానిక చేపల తూము సెంటరులో కంచి మురళీకృష్ణ అలియాస్ చిన్నికృష్ణపై కొందరు వ్యక్తులు కత్తులతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చిన్నికృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి.
–lఏప్రిల్ 4 మధ్యాహ్నం స్థానిక కెనాల్ రోడ్డులోని ఓ షాపులో న్యాయవాది పీడీఆర్ రాయల్‌ను కొందరు వ్యక్తులు కత్తులతో దారుణంగా పొడిచి హత్యచేసి పరారయ్యారు.
l– జూన్ 28 సాయంత్రం స్థానిక వన్‌టౌన్‌లోని పాత ఎస్‌బీఐ బ్యాంకు వద్ద పినకడిమికి చెందిన తూరపాటి నాగరాజుపై కొందరు వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు.
–lతాజాగా గురువారం ఏలూరు ఆర్‌ఆర్‌పేటలో కంచి నరేంద్ర కృష్ణ అలియాస్ పెద్ద కృష్ణను ప్రత్యర్థులు దారికాసి నరికిచంపడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో తెలుగుదేశం నేత హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ హత్య పోలీసు వైఫల్యానికి నిదర్శనమనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. వారం రోజులుగా నగరంలో ఒకరిని హత్య చేసేందుకు కొందరు దుండగులు కత్తులతో ఆటోలో సంచరిస్తున్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ సమాచారంతో ఒక ఎస్‌ఐ వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుండగా, ఒక ప్రజాప్రతినిధి కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో వారిని వదిలిపెట్టినట్లు సమాచారం. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఉంటే ఈ హత్య జరిగేది కాదని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.
శత్రువుల పనేనా!
చేపల తూము సెంటర్‌లో నివాసం ఉండే కంచి నరేంద్ర కృష్ణ అలియాస్ పెద్ద కృష్ణ, కంచి మురళీకృçష్ణ్ణ అలియాస్ చిన్ని కృష్ణ అన్నదమ్ములు. వీరు పాత ఇనుము వ్యాపారం చేస్తున్నారు. కొద్ది కాలంగా వీరి వర్గానికి, స్థానిక 37వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి భర్త సురేష్ వర్గానికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 8న సురేష్ వర్గానికి చెందిన కొందరు చేపల తూము సెంటరులో చిన్ని కృష్ణపై కత్తులతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులు క్రైం నంబరు 26/2016గా కేసు నమోదు చేశారు. ఈ కేసులో సురేష్‌తో సహా మొత్తం ఏడుగురు నిందితులున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో గురువారం పెద్ద కృష్ణను హత్య చేసింది కూడా సురేష్ వర్గానికి చెందిన వారే అయి ఉంటారనే కొణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతోపాటు 2012లో జరిగిన బోద్దా గంగాధర్‌రావు హత్యకేసుకు సంబంధించిన ఎవరైనా ఈ హత్యకు పాల్పడి ఉంటారా అనే కొణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. పెద్దకృష్ణ, చిన్నికృష్ణ రెండు కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నారు. 2006లో కొత్తపేటలో నివాసం ఉండే రాయపల్లి సోమేశ్వరావు కుమారైను పెద్దకృష్ణ మేనల్లుడు సతీష్ వేధించడంతో అప్పట్లో సోమేశ్వరరావు, అతని బంధువులు సతీష్‌ను మందలించారు. దీంతో సతీష్, పెద్దకృష్ణ, చిన్నకృష్ణ 2006 మే 15న సోమేశ్వరరావుపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో పెద్దకృష్ణ, చిన్నికృష్ణ, సతీష్‌లతో పాటు కొంత మందిపై కేసు నమోదైంది. ఆ తర్వాత సోమేశ్వరరావు వర్గానికి చెందిన బోర్ల కృష్ణ, బోద్దా గంగధర్‌రావు కలసి 2008లో పెద్దకృష్ణ మేనల్లుడు సతీష్‌ను హత్య చేశారు. దీంతో కక్ష పెంచుకున్న పెద్దకృష్ణ, చిన్నికృష్ణ సతీష్ కేసులో నిందితుడైన బోద్దా గంగధర్‌రావును 2012 జూలై 10న హత్య చేశారు. దీంతో ఇద్దరు కృష్ణలతో పాటు మొత్తం 10 మందిపై టూటౌన్ పోలీసులు 2012 సెప్టెంబర్ 20న రౌడీషీట్ తెరిచారు. పెద్ద కృష్ణను దారుణంగా హత్య చేసిన అనంతరం నలుగురు నిందితులు ఏలూ రు డీఎస్పీ కార్యాలయంలో లొంగిపోయినట్లు సమాచారం. వారిని విచారణ నిమిత్తం ద్వార కా తిరుమల స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోం ది. పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. నిందితులను 48 గంటల్లో పట్టుకుంటామని ఎస్పీ భాస్కర్‌భూషణ్ ప్రకటించారు.