హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్‌ | Murder accused arrested | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్‌

Sep 22 2016 1:25 AM | Updated on Oct 4 2018 8:29 PM

హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్‌ - Sakshi

హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్‌

ఆత్మకూరురూరల్‌ : సొంత వదినపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని బుధవారం అరెస్ట్‌ చేసినట్లు ఆత్మకూరు సీఐ ఎస్‌కే ఖాజావళి తెలిపారు. బుధవారం ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

 
ఆత్మకూరురూరల్‌ : సొంత వదినపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని బుధవారం అరెస్ట్‌ చేసినట్లు ఆత్మకూరు సీఐ ఎస్‌కే ఖాజావళి తెలిపారు. బుధవారం ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనంతసాగరం మండలం పడమటి కంభంపాడుకు చెందిన పెరుమాళ్ల పెద్ద వెంకటమ్మ, ఆమె మరిది మస్తానయ్య మధ్య ప్రహరీ సరిహద్దు వివాదం కొంత కాలంగా ఉంది. ఈ క్రమంలో  ఐదు రోజుల క్రితం ప్రహరీ నిర్మాణం చేయిస్తున్న పెద వెంకటమ్మపై కత్తితో మస్తానయ్య హత్యాయత్నం చేశాడు. ఆమె చేయి అడ్డుపెట్టడంతో అర చేయి వరకు తెగి పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిందితుడు మస్తానయ్య పరారీలో ఉన్నాడు. సోమశిల ఎస్‌ఐ ఖాజీబాబు నిందితుడుపై నిఘా ఉంచి బుధవారం గ్రామానికి వెళ్తుండగా అరెస్ట్‌ చేసి ఆత్మకూరుకు తరలించారు.   

Advertisement
 
Advertisement
Advertisement