‘ప్రభుత్వం మాదిగలను విస్మరిస్తోంది’ | mrps fires on tdp government | Sakshi
Sakshi News home page

‘ప్రభుత్వం మాదిగలను విస్మరిస్తోంది’

Jun 11 2017 11:41 PM | Updated on Sep 5 2017 1:22 PM

ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాయ మాటలు చెప్పిన చంద్రబాబు ... సీఎం కాగానే మాదిగలను విస్మరిస్తున్నారని ఎంఈఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు శంకర్‌ విమర్శించారు.

అనంతపురం న్యూటౌన్‌ : ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాయ మాటలు చెప్పిన చంద్రబాబు ... సీఎం కాగానే మాదిగలను విస్మరిస్తున్నారని ఎంఈఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు శంకర్‌ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేయాలన్న డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్త  పర్యటనను ప్రారంభించిన ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగను చిత్తూరు జిల్లాలో అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆదివారం రాత్రి నిరసన తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్ద మాదిగనై మాదిగలకు అండగా ఉంటానన్న ముఖ్యమంత్రి  ఇప్పుడు మందకృష్ణ పర్యటనను అడ్డుకోవడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి మాదిగలు సిద్ధంగా ఉన్నారని, త్వరలో తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకులు మధు మాదిగ, హనుమంతు, ఎంఈఎఫ్‌ నాయకులు నరసింహులు, అమరనాథ్, గోవిందు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement