
సాక్షి,విజయవాడ: ఛలో విజయవాడకి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు పిలుపునిచ్చాయి. ఈ నెల 23వ తేదీన మహాధర్నా చేపట్టనున్నట్లు ఆశా ప్రకటించింది. 10వ తేదీ నుండి నెట్ వర్క్ ఆసుపత్రులు సమ్మె కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం రూ.2700 కోట్ల రూపాయిల బకాయిలు విడుదల చేయాలని సమ్మె బాట పట్టాయి. సమ్మెబాట పట్టి 10 రోజులు దాటిన ప్రభుత్వం పట్టించుకోలేదు.దీంతో ఆగ్రహానికి గురైన ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఛలో విజయవాడ సమ్మెలో ఆసుపత్రి యాజమాన్యాలతో పాటు సిబ్బంది పాల్గొననున్నారు.
మరోవైపు, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో వైద్యం అందక తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నా.. కూటమి ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్క్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.