కుక్కను మించిన విశ్వాసం.. | most faithful cock in nalgonda district | Sakshi
Sakshi News home page

కుక్కను మించిన విశ్వాసం..

Apr 6 2017 10:23 PM | Updated on Oct 1 2018 2:44 PM

కుక్కను మించిన విశ్వాసం.. - Sakshi

కుక్కను మించిన విశ్వాసం..

సాదారణంగా ఇళ్ళు, వ్యవసాయ బావుల వద్ద కాపలా కోసం కుక్కలను పెంచుకుంటాం.

అర్వపల్లి: సాదారణంగా ఇళ్ళు, వ్యవసాయ బావుల వద్ద కాపలా కోసం కుక్కలను పెంచుకుంటాం. కానీ, కుక్కలకు మించి కాపలాగా ఉంటుంది ఆకోడిపుంజు. మండలంలోని కొమ్మాల గ్రామంలో సర్పంచ్‌ కుంట్ల సురేందర్‌రెడ్డి తన వ్యవసాయ బావి వద్ద ఓ కోడిపుంజును పెంచుతున్నారు. ఇందులో పెద్ద విషయమేముంది అనుకుంటున్నారా... ఈ కోడిపుంజు ఆరున్నర కిలోల బరువు ఉంటుంది. అయితే ఇది మామూలు కోడి పుంజు కాదు.

కుక్క కన్న విశ్వాసం గలది ఈ కోడిపుంజు ఆ బావి వద్దకు కొత్త వ్యక్తులు వస్తెచాలు వెంటబడి పొడుస్తుంది. తన యజమాని కుటుంబ సభ్యులను తప్ప మరెవ్వరిని అక్కడకు రానివ్వదు. ఎవరైనా కొత్త వారు వస్తున్నారంటే కుటుంబ సభ్యులు కోడిపుంజుని అటు వైపు పోనివ్వరు. దూరంగా తీసుకెళుతారు. లేదంటే పశువల దొడ్లోకి తోలుతారు. ఎంతైనా ఆ కోడిపుంజు విశ్వాసం గలది కదూ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement