టీఆర్‌ఎస్‌.. మాటలకే పరిమితం | mlc ramachandra rao commented over trs | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌.. మాటలకే పరిమితం

May 21 2017 2:30 AM | Updated on May 28 2018 3:58 PM

టీఆర్‌ఎస్‌.. మాటలకే పరిమితం - Sakshi

టీఆర్‌ఎస్‌.. మాటలకే పరిమితం

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాటల కే పరిమితమైందని ఎమ్మెల్సీ రామచందర్‌రావు అ న్నారు. శుక్రవారం భువనగిరిలోని బీజేపీ జిల్లా కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

హామీల అమలులో సర్కార్‌ విఫలం
బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు

సాక్షి, యాదాద్రి : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాటల కే పరిమితమైందని ఎమ్మెల్సీ రామచందర్‌రావు అ న్నారు. శుక్రవారం భువనగిరిలోని బీజేపీ జిల్లా కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని, రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, ప్రజలు సంతోషంగా లేరన్నారు. నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మూడేళ్ల కాలంలో కేవలం 20 వేలు మాత్రమే భర్తీ చేశారని పేర్కొన్నారు. మిగిలినవి ఎపుడు చేస్తారని, హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని విమర్శించారు. అలాగే డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు పూర్తి చేయలేదని, ప్రజాస్వామ్య హక్కులను పట్టించుకోవడం లేదన్నారు.

కేంద్ర ప్రభుత్వ పాలన పట్ల దేశం మొత్తం హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. కేంద్రం అన్ని రాష్ట్రాల అభివృద్ధికి సహకరిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 24న యాదాద్రిభువనగిరి జిల్లాకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రానున్నట్లు వెల్లడిం చారు. ఇక్కడ ఉన్న మేధావులతో చర్చిస్తారని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిమ్స్‌ను ఎయిమ్స్‌గా ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు కావాల్సి 200 ఎకరాల భూమిని చూపకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు.

కేం ద్రానికి తెలంగాణపై ఎలాంటి వివక్ష లేదని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం  హైకోర్టు విభజనకు కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు, రాష్ట్ర నాయకుడు కాసం వెంకటేశ్వర్లు, దళితమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు వేముల అశోక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతంశెట్టి రవిందర్, కర్నాటి ధనుంజయ, పాశం భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నర్ల నర్సింగరావు, పడమటి జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి నీలం రమేష్, పట్టణశాఖ అధ్యక్షుడు చంద మహేందర్‌గుప్త తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement