మైనర్ బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం | mionr girl raped in prakasham district | Sakshi
Sakshi News home page

మైనర్ బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Feb 26 2017 10:51 AM | Updated on Jul 28 2018 8:53 PM

మైనర్ బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం - Sakshi

మైనర్ బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

ప్రకాశం జిల్లాలో దారుణం వెలుగుచూసింది.

చీరాల(ప్రకాశం):
ప్రకాశం జిల్లాలో దారుణం వెలుగుచూసింది. జిల్లాలోని చీరాల జవహర్‌నగర్‌కు చెందిన ఓ మైనర్‌ బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్‌ బాలుడు లైంగికదాడికి ఒడిగట్టాడు. కాలనీకి చెందిన బాలుడు(17) ఇంటి పక్కనే ఉంటున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని(13)తో చనువుగా ఉండేవాడు.

ఈ క్రమంలో బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement