బాలికపై లైంగిక దాడి | Minor raped | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక దాడి

Sep 30 2016 7:35 PM | Updated on Jul 28 2018 8:53 PM

మద్యంమత్తులో ఉన్న యువకుడు బాలిక (14)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కైకలూరులో శుక్రవారం జరిగింది.

కైకలూరు (కృష్ణా జిల్లా) : మద్యంమత్తులో ఉన్న యువకుడు బాలిక (14)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కైకలూరులో శుక్రవారం జరిగింది. స్ధానిక వెలంపేట కాలనీలో ఆరో తరగతి చదువుతోన్న బాలిక దసరా సెలవులు ఇవ్వడంతో తన స్నేహితురాలితో కలిసి ఇంట్లో ఉంది.

ఈ సమయంలో బీరువాల తయారీ దుకాణంలో పనిచేసే బెల్లాని నాని (22) అనే వ్యక్తి మద్యం మత్తులో ఇంటిలో దూరాడు. బాలిక స్నేహితురాలిని బయటకు పంపి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇరుగుపొరుగువారు రావడంతో పరారయ్యాడు. తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరీక్షల నిమిత్తం బాలికను ప్రభుత్వాసుపత్రికి పంపారు. టౌన్ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement