మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం | minor girl kidnapped and raped in medak district | Sakshi
Sakshi News home page

మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం

Jan 17 2016 8:53 PM | Updated on Jul 28 2018 8:44 PM

మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం - Sakshi

మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం

మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన సంఘటన మెదక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జోగిపేట: మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన సంఘటన మెదక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఆదివారం జోగిపేట పోలీసులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

అల్లాదుర్గం మండలానికి చెందిన దుర్గయ్య, పోచమ్మలు చౌటకూర్లో ఓ కాంట్రాక్టర్ వద్ద కూలీలుగా పనిచేస్తుంటారు. వీరికి 13 ఏళ్ల వయస్సు ఉన్న కుమార్తె ఉంది. చౌటకూర్ గ్రామంలోని కొన్యాల యాదయ్య, రాజులు నివాసం ఉండే ఇంటి ముందు గుడిసెను ఏర్పాటు చేసి నివాసముంటున్నారు. మైనర్ బాలికపై రాజు (35) కన్ను పడింది. ఈ క్రమంలో రాజు మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని తన సోదరుడు యాదయ్యతో కలిసి బాలిక తల్లిదండ్రులను అడిగాడు. అయితే వారు అంగీకరించలేదు.

గత నెల 28వ తేదిన తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో మాయమాటలు చెప్పి అమ్మాయిని రాజు వెంట తీసుకొని వెళ్లాడు. అమ్మాయిని మొదట హత్నూర, దౌల్తాబాద్ ప్రాంతాలకు తీసుకువెళ్లి ఆమె వద్ద నున్న వెండి కడియాలను అమ్మేసి.. ఆ డబ్బులతో బట్టలు, ఇతర సామాన్లు కొనుక్కొని నర్సాపూర్‌లోని ఒక ఇంట్లో కాపురం పెట్టాడు.

జనవరి 1వ తేదీన తన కూతురు కిడ్నాప్ అయినట్లు తండ్రి దుర్గయ్య పుల్కల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి స్థానిక ఎస్సై సత్యనారాయణ రాజు అతడి కుటుంబ సభ్యులపై నిఘా పెట్టి నర్సాపూర్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఆదివారం ఉదయం పుల్కల్ పోలీసులు నర్సాపూర్ వెళ్లి రాజు, మైనర్ బాలికలను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సహకరించిన సోదరుడు యాదయ్యలను కూడా అదుపులోకి తీసుకున్నారు. రాజుపై మైనర్ బాలికపై కిడ్నాప్, అత్యాచారం, పలు సెక్షన్‌లతో పాటు సహకరించినందుకు యాదయ్యపై కూడా కేసు నమోదు చేసారు. జోగిపేట మున్సిఫ్‌కోర్టుకు నిందితులను తరలించారు. కోర్టు ఆదేశాలతో వారిని రిమాండ్‌కు పంపారు. మైనర్ బాలికను చికిత్సల నిమిత్తం సంగారెడ్డి ఆసుపత్రికి పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement