2019 నాటికి దేశంలో ప్రతి ఇంటికీ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పియూష్ గోయల్ అన్నారు.
- కేంద్రమంత్రి పియూష్ గోయల్
తిరుమల : 2019 నాటికి దేశంలో ప్రతి ఇంటికీ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పియూష్ గోయల్ అన్నారు. ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని, ఆశీస్సులను శ్రీవేంకటేశ్వర స్వామివారు కల్పిస్తున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు టీటీడీ మెరుగైన సేవలు అందిస్తోందని కితాబిచ్చారు. వందశాతం పారిశుద్ధ్యం ఉన్న దేవస్థానం మరెక్కడా కనిపించదని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు కేంద్ర మంత్రికి ప్రత్యేక దర్శనం కల్పించి, శ్రీవారి లడ్డూప్రసాదాలు అందజేశారు.