నేడు మంత్రి కొల్లు రవీంద్ర రాక | minister kollu ravindra comes today | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి కొల్లు రవీంద్ర రాక

Sep 20 2016 10:26 PM | Updated on Sep 4 2017 2:16 PM

బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం జిల్లాకు విచ్చేస్తున్నారు.

అనంతపురం అర్బన్‌ : బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం జిల్లాకు విచ్చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు అనంతపురం చేరుకుని 10.30 వరకు ఆర్‌అండ్‌బి అతిథి గహంలో బసచేస్తారు. అనంతరం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగే జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. 1.15 గంటలకు రోడ్డు మార్గంలో రాయదుర్గం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన నీరు– చెట్టు కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ఆరు గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ బయలుదేరి వెళతారు. 

Advertisement
 
Advertisement
Advertisement