గుడేకల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గుంటూరు వలస వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.
విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి
May 6 2017 12:56 AM | Updated on Sep 5 2018 2:26 PM
ఎమ్మిగనూరు రూరల్: గుడేకల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గుంటూరు వలస వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బోయ నాగరాజు(32)కు భార్య పద్మావతి, ముగ్గురు సంతానం. 15 సంవత్సరాలుగా ఆటోను నడుపుతు జీవనం సాగించేవాడు. రెండు నెలల కిత్రం ఆటోను ఆర్టీఓ అ«ధికారులు సీజ్ చేశారు. నిబంధనలు మేరకు రూ. 20 వేలు జరిమానా కట్టాలని చెప్పటంతో చేసేది లేక వృత్తి మానేశాడు. కుటుంబాన్ని పోషించేందుకు ఇటీవల గుంటూరుకు వలస వెళ్లాడు. అక్కడ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా రెండు రోజుల కిత్రం విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడటంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా కోమాలోనే ఉన్నాడు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చేతులెత్తేయడంతో కుటుంబీకులు ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి భార్యపిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Advertisement
Advertisement