ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మండిపడ్డారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో చంద్రబాబు కీలుబొమ్మగా మారారంటూ ఆయన విమర్శించారు. శనివారం రఘువీరా అనంతపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. విలీన గ్రామాలు ఏపీలో ఉండాల్సిందేనని రఘువీరా డిమాండ్ చేశారు.