హౌసింగ్‌ అధికారులకు మెమోలు | memos of housing officers | Sakshi
Sakshi News home page

హౌసింగ్‌ అధికారులకు మెమోలు

Sep 22 2017 10:18 PM | Updated on Mar 21 2019 8:30 PM

విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన గృహనిర్మాణ సంస్థ ఇంజినీరింగ్‌ అధికారులకు కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ మెమోలు జారీ చేశారు.

అనంతపురం అర్బన్‌: విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన గృహనిర్మాణ సంస్థ ఇంజినీరింగ్‌ అధికారులకు కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ మెమోలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను జేసీ–2 సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్‌ శుక్రవారం తెలిపారు. పెనుకొండ, అనంతపురం డివిజన్లకు చెందిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు చంద్రమౌళి, ప్రసాద్‌లతో పాటు తొమ్మిది మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, 30 మంది అసిస్టెంట్‌ ఇంజనీర్లకు మెమోలు జారీ చేశారని చెప్పారు. శాఖ ద్వారా చేపట్టిన కార్యక్రమాలు అమలులో వీరంతా విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు కలెక్టర్‌ దృష్టికి రావడంతో, వారి తీరుని తీవ్రంగా పరిగణిస్తూ మెమో ఇచ్చారని జేసీ–2 చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement