'అవినీతి పరిపాలనకు చిరునామా చంద్రబాబు' | Meka sheshu babu slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

'అవినీతి పరిపాలనకు చిరునామా చంద్రబాబు'

Jun 2 2016 4:59 PM | Updated on Sep 22 2018 8:31 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రచార ఆర్భాటాల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ ఆర్ సీపీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రచార ఆర్భాటాల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ ఆర్ సీపీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లాలో మేకా శేషుబాబు విలేకరులతో మాట్లాడారు.

అవినీతి పరిపాలనకు చంద్రబాబు చిరునామా అని ఆయన ధ్వజమెత్తారు. మోసపూరిత వాగ్దానాలు ఇస్తూ నిత్యం చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు స్వార్థ రాజకీయాలే కారణమని ఎమ్మెల్సీ మేకా శేషు బాబు విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement