ఆందోళనబాటలో వైద్య, ఆరోగ్య ఉద్యోగులు | medical staff wenton straike | Sakshi
Sakshi News home page

ఆందోళనబాటలో వైద్య, ఆరోగ్య ఉద్యోగులు

Nov 7 2016 11:43 PM | Updated on Oct 9 2018 7:52 PM

డిమాండ్ల సాధనకు వైద్య, ఆ రోగ్యశాఖ ఉద్యోగులు ఆందోâýæన బాట పట్టారు. స్థానిక డీఎంహెచ్‌ఒ కార్యాలయం ఎదుట సోమవారం సా మూహిక నిరాహారదీక్షలు చేపట్టారు.

డిమాండ్ల సాధనకు నిరాహారదీక్షలు  
అనంతపురం మెడికల్‌ : 
డిమాండ్ల సాధనకు వైద్య, ఆ రోగ్యశాఖ ఉద్యోగులు ఆందోâýæన బాట పట్టారు. స్థానిక డీఎంహెచ్‌ఒ కార్యాలయం  ఎదుట సోమవారం సా మూహిక నిరాహారదీక్షలు చేపట్టారు. ఆ సంఘం  ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ రవూఫ్‌సాహెబ్, కన్వీనర్‌ నాగరాజు మాట్లాడారు. వారాంతపు సెలవు మం జూరు చేయడంతోపాటు బయోమెట్రిక్‌ విధానం నుంచి త మకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

డీఎస్సీ ద్వారా ఎంపిౖకెన పారామెడికల్‌ ఉద్యోగులను  రెగ్యులర్‌ చేయాలన్నారు.  రక్త నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం పరిధిలోనే చేయాలని, మెడాల్‌ సంస్థను తొలగించాలన్నారు. మహిళా ఉద్యోగులకు జీతంతో కూడిన ఆరు నెలల ప్రసూతి సెలవులు ఇవ్వాలన్నారు. అ¯ŒSమోల్, ఎంసీటీఎస్‌ తదితర కార్యక్రమాల కోసం డేటా ఎంట్రీ ఆపరేటర్లను పీహెచ్‌సీల్లో నియమించాలని డిమాండ్‌ చేశారు. వైద్య ఆరోగ్యశాఖలోని ఉ ద్యోగుల పట్ల డీఎంహెచ్‌ఓ   కె.వెంకటరమణ  వైఖరి çసరిగాలేదని ఆరోపించారు. డీఎంహెచ్‌ఓ ఆందోâýæనకారుల తో మాట్లాడారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను తాను పాటిస్తున్నానని, వ్యక్తిగతంగా ఎవరి మీదా కక్ష లేదని స్పష్టం చేశారు.

సమస్యల పరిష్కాాన్రికి ఆయన హామీ ఇవ్వకపోవడంతో వారం రోజులు ఆందో âýæన కొనసాగించాలని నేతలు నిర్ణయించారు. ఎమ్మెల్సీ గేయానంద్, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరామప్ప, ఐఎ¯ŒSటీయూసీ  , ఏఐటీయూసీ , వైఎస్‌ఆర్‌సీపీ, ఎన్జీఓ,  ఆరోగ్య సి బ్బంది ఆందోళనకు మద్దతు తెలిపారు. కమిటీ కోశాధికారి రేణుకాదేవి, కో కన్వీనర్లు సాంబశివమ్మ, చంద్రమోహన్, శ్రీధర్‌బాబు, రాఘవేంద్రకుమార్, షఫి  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement