నిడదవోలులో భారీ చోరీ | massive theft in Nidadavolu in west godawari | Sakshi
Sakshi News home page

నిడదవోలులో భారీ చోరీ

Oct 8 2016 10:53 AM | Updated on Sep 4 2017 4:40 PM

కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లివచ్చేసరికి ఇంటిలోని సొత్తు చోరీకి గురైంది.

నిడదవోలు: కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లివచ్చేసరికి ఇంటిలోని సొత్తు చోరీకి గురైంది. ఈఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో శుక్రవారం రాత్రి  జరిగింది. స్థానిక ఇందిరానగర్‌కు చెందిన మద్ది సూరిబాబు కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 10 కాసుల బంగారు ఆభరణాలతోపాటు రూ.70వేల నగదును ఎత్తుకుపోయారు. శనివారం ఉదయం బాధితులు ఇంటికి చేరుకోగా దొంగతనం జరిగినట్లు తేలింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement