విశాఖ శివారులో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
విశాఖ శివారులో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోపాలపట్నం సమీపంలోని కంపరపాలెం కాలనీలో సరుగుడు తోటల్లో మంటలు చెలరేగాయి. సుమారు 70 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో చెట్లు దగ్ధమయ్యాయి. వాహనాలు వెళ్లేందుకు మార్గం అనువుగా లేకపోవడంతో ఓ అగ్నిమాపక సిబ్బంది ఓ శకటంతో అక్కడకు కష్టంగా చేరుకుని.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. అయినా మంటలు అదుపులోకి రాలేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉంటారని భావిస్తున్నారు.