వివాహిత ఆత్మహత్య | married woman suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Nov 28 2016 11:19 PM | Updated on Nov 6 2018 7:56 PM

అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెందిన కర్నూలు మండలం గార్గేయపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మ (32) సోమవారం ఆత్మహత్య చేసుకుంది.

కర్నూలు : అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెందిన కర్నూలు మండలం గార్గేయపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మ (32) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. జూపాడుబంగ్లా మండలం తాటిపాడుకు చెందిన నాగిరెడ్డి, రాధమ్మ దంపతుల కూతురు వెంకటేశ్వరమ్మను గార్గేయపురం గ్రామానికి చెందిన బాబురెడ్డికి ఇచ్చి 16 సంవత్సరాల క్రితం పెళ్లి జరిపించారు. వీరికి కూతురు, కుమారుడు సంతానం. కడుపునొప్పితో బాధ పడుతుండటంతో ఆసుపత్రిలో వైద్యచికిత్సలు చేయించి గర్భసంచి తొలగించారు. ఉబ్బసం వ్యాధితో కొంతకాలంగా బాధ పడుతుండేది. జబ్బు నయం కాదని కలత చెంది ఇంట్లోనే ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించే సరికే చనిపోయింది. తల్లి రాధమ్మ ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement