మరికల్‌ను మహబుబ్‌నగర్‌లో కలపాలి | marikal mix in mahaboobnagar | Sakshi
Sakshi News home page

మరికల్‌ను మహబుబ్‌నగర్‌లో కలపాలి

Aug 21 2016 11:31 PM | Updated on Mar 28 2018 11:26 AM

మరికల్‌ను మహబుబ్‌నగర్‌లో కలపాలి - Sakshi

మరికల్‌ను మహబుబ్‌నగర్‌లో కలపాలి

మండలంలోని మరికల్ గ్రామాన్ని మహబూబ్‌నగర్‌ జిల్లాలో కలపాలంటూ ఆదివారం ఆ గ్రామస్తులు పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు కుల్కచర్ల- నవాబుపేట రోడ్డు పై బైఠాయించి ధర్నా చేశారు.

కుల్కచర్ల: మండలంలోని మరికల్  గ్రామాన్ని మహబూబ్‌నగర్‌ జిల్లాలో కలపాలంటూ ఆదివారం  ఆ గ్రామస్తులు పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు కుల్కచర్ల- నవాబుపేట రోడ్డు పై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మండలంలో మరికల్‌ పెద్ద పంచాయతీ అన్నారు. నాలుగు అనుబంధ గ్రామాలు, గిరిజన తండాలు ఉన్నాయన్నారు. 10 వేల వరకు జనాభా ఉంటుందన్నారు. మరికల్‌ గ్రామానికి కుల్కచర్ల  24 కిలో మీటర్ల దూరంలో ఉంటుందన్నారు.  అదే మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం కేవలం 18కిలో మీటర్ల  దూరం మాత్రమే ఉంటుందన్నారు.మహబూబ్‌‌నగర్‌ జిల్లాకు వెళ్లాలంటే  ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బస్సు సౌకర్యం ఉందని, కుల్కచర్ల మండలానికి వెళ్లాలంటే  ఇబ్బందులు పడాల్సి వస్తోంన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు పాండురంగయ్య, యువజన సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement