గంజాయి పట్టివేత | marijuana caught | Sakshi
Sakshi News home page

గంజాయి పట్టివేత

Sep 23 2016 9:58 PM | Updated on Sep 4 2017 2:40 PM

గంజాయి పట్టివేత

గంజాయి పట్టివేత

మేడికొండూరు మండల పరిధిలోని పేరేచర్ల జంక్షన్‌లో గుంటూరు ప్రత్యేక విభాగం పోలీసులు శుక్రవారం గంజాయిని విక్రయిస్తున్న మహిళను అదుపులోకి తీసుకున్నారు.

పేరేచర్ల: మేడికొండూరు మండల పరిధిలోని పేరేచర్ల జంక్షన్‌లో గుంటూరు ప్రత్యేక విభాగం పోలీసులు శుక్రవారం గంజాయిని విక్రయిస్తున్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు ప్రత్యేక పోలీసు విభాగ ఏఎస్‌ఐ శ్రీహరి తెలిపిన వివరాల మేరకు... పేరేచర్ల జంక్షన్‌లోని నర్సారావుపేట రోడ్డులోని ఫ్లైఓవర్‌ సమీపంలోని ఓహోటల్‌లో ఒక మహిళ గంజాయి విక్రయిస్తుండగా దాడి చేసి పట్టుకున్నట్లు వివరించారు. ఆమె వద్ద నుంచి (8 పొట్లాలు) సుమారు 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గుంటూరు అర్బన్‌ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠీ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. దాడులలో సిబ్బంది కృపారత్నం పాల్గొన్నారు. పట్టుబడిన గంజాయిని మేడికొండూరు పోలీసులకు అందజేశారు. సీఐ బాలాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement