పోలీసుల అదుపులో మిలిషియా సభ్యుడు | Maoist militia member arrested in east godavari district | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో మిలిషియా సభ్యుడు

Sep 9 2015 10:42 AM | Updated on Oct 9 2018 2:47 PM

తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం బొద్దుగూడెంలో మావోయిస్టు మిలిషియా సభ్యుడు మంచిక మహదేవ్‌ను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

చింతూరు : తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం బొద్దుగూడెంలో మావోయిస్టు మిలిషియా సభ్యుడు మంచిక మహదేవ్‌ను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. బొద్దుగూడెంలో మావోయిస్టు పోస్టర్లను మహదేవ్ గోడలపై అతికిస్తున్నాడు.

ఆ క్రమంలో గస్తీ తిరుగుతున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. మహేదేవ్ స్వగ్రామం చింతూరు మండలం పెగ పంచాయతీ ఎదిర్లగూడెం అని పోలీసులు తెలిపారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement