యువకుడి అనుమానాస్పద మృతి | man susupicious death | Sakshi
Sakshi News home page

యువకుడి అనుమానాస్పద మృతి

Jan 8 2017 10:21 PM | Updated on Sep 5 2017 12:45 AM

పట్టణంలోని గుడ్డం రంగనాథస్వామి ఆలయం సమీపాన రైల్వేట్రాక్‌ వద్ద ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

హిందూపురం అర్బన్‌ : పట్టణంలోని గుడ్డం రంగనాథస్వామి ఆలయం సమీపాన రైల్వేట్రాక్‌ వద్ద ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రైలులోంచి జారిపడి చనిపోయాడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా.. పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో ప్రాణం కోల్పోయాడా అన్నది తెలియడం లేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని రైల్వే ఎస్‌ఐ ప్రభాకర్‌ తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిస్తే తమకు తెలియజేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement