ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య | man suicides in pulakunta | Sakshi
Sakshi News home page

ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

Nov 3 2016 10:20 PM | Updated on Aug 29 2018 8:38 PM

మండలంలోని పూలకుంటలో ఇర్ఫాన్‌(22) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ ఆంజనేయులు గురువారం తెలిపారు.

హిందూపురం రూరల్‌ : మండలంలోని పూలకుంటలో ఇర్ఫాన్‌(22) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ ఆంజనేయులు గురువారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పూలకుంటకు చెందిన ఇర్ఫాన్‌  కూలి పనులకు వెళ్లకుండా నెల రోజులుగా ఖాళీగా ఉండటంతో అతడి తల్లి సహినా మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఇర్ఫాన్‌ గురువారం ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని  ఆత్మహత్య చేసుకున్నాడు.

కూలి పనుల నుంచి తల్లి సహినా, అన్న సత్తార్‌ ఇంటికి వచ్చి చూసే సరికి తలుపులు ఎంతకీ తెరవలేదు. అనుమానం వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ  తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement