అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య | man suicides in gangadevipalli | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

Feb 23 2017 11:28 PM | Updated on Aug 29 2018 8:38 PM

తాడిపత్రి మండలం గంగాదేవిపల్లికి చెందిన సంజప్ప(42) అనే వ్యక్తి అప్పుల బాధ తాళలేక గురువారం గ్రామ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

తాడిపత్రి రూరల్‌ : తాడిపత్రి మండలం గంగాదేవిపల్లికి చెందిన సంజప్ప(42) అనే వ్యక్తి అప్పుల బాధ తాళలేక  గురువారం గ్రామ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. సంజప్ప అంత్రాలు వేస్తు జీవనం సాగిస్తున్నాడు. చెడు వ్యసనాలకు లోనై అప్పులు చేశాడు. అప్పుల బాధ అధికం కావడంతో మనస్థాపానికి గురై గురువారం ఉదయం గ్రామ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement