అనంతపురం జిల్లా యాడికి మండలం నగరూరుకు చెందిన గణేశ్(21) పురుగుల మందు తాగి శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
యాడికి (తాడిపత్రి రూరల్) : అనంతపురం జిల్లా యాడికి మండలం నగరూరుకు చెందిన గణేశ్(21) పురుగుల మందు తాగి శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం అంక్కిరెడ్డిపల్లికి చెందిన శిరీషాతో నాలుగు నెలల కిందటే అతనికి పెళ్లైంది. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న గణేశ్ జీవితంపై విరక్తితో ఈ అఘాయ్యితానికి ఒడిగట్టినట్లు వివరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.