వ్యక్తి ఆత్మహత్యాయత్నం | man suicide attempt in p.kothapalli | Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Oct 27 2016 11:12 PM | Updated on Sep 4 2017 6:29 PM

మండల పరిధిలోని పి. కొత్తపల్లిలో గురువారం ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది.

గార్లదిన్నె : మండల పరిధిలోని పి. కొత్తపల్లిలో గురువారం ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన వివరాలు మేరకు...  సుధాకర్‌ (30) అనే వ్యక్తి పురుగుమందు తాగి అపస్మారకస్థితిలో పడిఉండగా స్థానికులు గమనించి బంధువులకు సమాచారం అందించారన్నారు.  వెంటనే వారు చికిత్స నిమిత్తం 108కు సమాచారం అందించడంతో అనంతపురము ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అయితే సుధాకర్‌ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement