breaking news
p.kothapalli
-
వ్యక్తి అనుమానాస్పద మృతి
పామిడి : మండలంలోని పీ కొత్తపల్లిలో మంగళవారం ఉదయం అనుమానస్పదస్థితిలో ఎస్. శ్రీనివాసులుయాదవ్(48) అనే వ్యక్తి మృతి చెందారు. సోమవారం రాత్రి పామిడిలో జరిగిన విందు కార్యక్రమానికి శ్రీనివాసులు వెళ్లి వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం అతడు గురుకలు పెడతూ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. కుటుంబసభ్యులు ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆహారం విషతుల్యమై శ్రీనివాసులు మృతి చెంది ఉంటాడన్న అనుమానాన్ని కుటుంబసభ్యులు వ్యక్తం చేస్తున్నారు. అతడికి భార్య ఆదిలక్ష్మి, కుమారుడు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
గార్లదిన్నె : మండల పరిధిలోని పి. కొత్తపల్లిలో గురువారం ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన వివరాలు మేరకు... సుధాకర్ (30) అనే వ్యక్తి పురుగుమందు తాగి అపస్మారకస్థితిలో పడిఉండగా స్థానికులు గమనించి బంధువులకు సమాచారం అందించారన్నారు. వెంటనే వారు చికిత్స నిమిత్తం 108కు సమాచారం అందించడంతో అనంతపురము ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అయితే సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.