వ్యక్తి ఆత్మహత్య | Man suicide | Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్య

Aug 22 2016 11:21 PM | Updated on Jun 1 2018 8:39 PM

మండల పరిధిలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన లోకేశ్‌ (23) విషపు గుళికలను మింగి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనకు సంబంధించి ఏఎస్‌ఐ విజయనాయక్‌ తెలిపిన వివరాల మేరకు..

గుండ్లపల్లి (బెళుగుప్ప):

మండల పరిధిలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన లోకేశ్‌ (23) విషపు గుళికలను మింగి సోమవారం  ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనకు సంబంధించి ఏఎస్‌ఐ విజయనాయక్‌ తెలిపిన వివరాల మేరకు లోకేశ్‌ గత కొన్ని నెలలుగా కడుపునొప్పితో బాధ పడుతుండేవాడన్నారు. సోమవారం విపరీతమైన కడుపు నొప్పి రావడంతో నొప్పిని భరించ లేక ఇంట్లోనే విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. కుటుంబ సభ్యులు గమనించి  కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారని,  అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. సంఘటనపై మృతుని భార్య సుమిత్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement