యువకుడి దారుణహత్య | man murdered in itukalapalli | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణహత్య

Apr 4 2017 12:45 AM | Updated on Aug 29 2018 8:36 PM

యువకుడి దారుణహత్య - Sakshi

యువకుడి దారుణహత్య

ఇటుకలపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని విజయనగర దాబా వద్ద ఆదివారం రాత్రి గుర్తుతెలియని యువకుడు దారుణహత్యకు గురయ్యాడు.

ఎస్కేయూ : ఇటుకలపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని విజయనగర దాబా వద్ద ఆదివారం రాత్రి గుర్తుతెలియని యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఎస్‌ఐ అబ్దుల్‌ కరీం కథనం ప్రకారం.. 35 సంవత్సరాల వయసు కలిగిన యువకుడి మెడకు వైరుతో గొంతుకు బిగించి చంపేశారు. ఆ తర్వాత గుర్తుపట్టకుండా ఉండేందుకు అతడి ముఖంపై డీజిల్‌ పోసి నిప్పుపెట్టారు. హతుడు కుడిచేతిపై రత్న, ఎడమ చేతిపై చిరంజీవి అనే పేర్లను పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. సోమవారం హత్యాస్థలిని సీఐ, ఎస్‌ఐలు పరిశీలించారు. హతుడి వివరాలు తెలిసిన వారు సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్‌ 9440796807 లేదా తన 9491414360 నంబర్‌ను సంప్రదించాలని ఎస్‌ఐ అబ్దుల్‌ కరీం సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement