వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన గురైన ఘటన శనివారం ఉదయం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
పిడుగురాళ్ల: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన గురైన ఘటన శనివారం ఉదయం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పిడుగురాళ్ల పట్టణం ఆదర్శనగర్‌కు చెందిన డేగల యోహాను(40) అనే వ్యక్తి తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో వేమనరపు జార్జి ఇనుపరాడ్‌తో కొట్టి చంపాడు. దీంతో యోహాను అక్కడిక్కడే మరణించాడు. అనంతరం జార్జి స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్‌ఐ జగదీష్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.