గుర్తు తెలియని వ్యక్తి మృతి | man dies in hindupur | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వ్యక్తి మృతి

Nov 6 2016 9:36 PM | Updated on Sep 4 2017 7:23 PM

గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి మృతి

పట్టణంలోని కేఎల్‌ రోడ్డులో 35 ఏళ్ల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు వన్‌టౌన్‌ ఏఎస్‌ఐ లోకేష్‌ తెలిపారు.

హిందూపురం అర్బన్‌ : పట్టణంలోని కేఎల్‌ రోడ్డులో 35 ఏళ్ల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు వన్‌టౌన్‌ ఏఎస్‌ఐ లోకేష్‌ తెలిపారు. ఆదివారం సాయంత్రం రోడ్డుపై అనిశ్చతగా పడి ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులైన ఉదయ్, గంగధరప్ప సాయంతో అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు చెప్పడంతో శవాన్ని మార్చురీలో భద్రపరిచారు. అతడి సమాచారం తెలిస్తే వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం అందించాలని ఏఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement