నందిగామలో ఉద్రిక్తత | Man attempts suicide in Nandigama | Sakshi
Sakshi News home page

నందిగామలో ఉద్రిక్తత

Dec 22 2016 9:07 PM | Updated on Sep 4 2017 11:22 PM

కృష్ణాజిల్లా నందిగామలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

నందిగామ(కృష్ణాజిల్లా): కృష్ణాజిల్లా నందిగామలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నందిగామలో వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తుండగా.. కూల్చివేతలు ఆపాలంటూ ఓ బిల్డర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అక్రమంగా కట్టిన అపార్ట్‌మెంట్‌ను తొలగించడానికి వచ్చిన సీఆర్‌డీఏ అధికారులను బిల్డర్ రావూరి రవి అడ్డుకున్నాడు.

దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కూల్చివేతలు ఆపాలని డిమాండ్ చేస్తూ.. బిల్డర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అడ్డుకోబోయిన సీఆర్‌డీఏ అధికారులపై కూడా పురుగుల మందు పడటంతో.. రవితో పాటు వారిని ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement