'ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తాం' | Malamahanadu leaders warnings to cm kcr over election promises implementing | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తాం'

Jun 13 2016 12:00 PM | Updated on Aug 14 2018 4:44 PM

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక మాల సామాజిక వర్గానికి గుర్తింపు లేకుండా పోయిందని, ఎన్నికల సమయంలో మాలలకు కేసీఆర్‌ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు రామ్మూర్తి అన్నారు.

మహబూబ్‌నగర్‌: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక మాల సామాజిక వర్గానికి గుర్తింపు లేకుండా పోయిందని, ఎన్నికల సమయంలో మాలలకు కేసీఆర్‌ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు రామ్మూర్తి అన్నారు.

ఆదివారం జిల్లాకేంద్రంలోని అంబేద్కర్‌ కళాభవన్‌లో మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు నర్సింహయ్య అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి మాలలకు రుణాలు రాకుండా పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారన్నారు. రెండేళ్ల పాలనలో కేసీఆర్‌ దళితులకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు శివకేశవులు, వెంకటస్వామి, శ్రీనివాస్, చెన్నకేశవులు, మాధవ్, శ్యాంసుందర్, మన్యం, అజిత్‌కుమార్, రామకృష్ణ, బ్యాగరి శ్రీనివాస్, వెంకట్రాములు, భీమయ్య, శ్రీనివాసులు, సుదర్శన్, మహేష్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement