రైతు సమస్యలపై ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేయాలి | Make Special Assembly 0n Former Problems | Sakshi
Sakshi News home page

రైతు సమస్యలపై ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేయాలి

Aug 19 2016 7:52 PM | Updated on Oct 30 2018 5:28 PM

మాట్లాడుతున్న ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి - Sakshi

మాట్లాడుతున్న ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి

వెల్దండ: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వెల్దండ మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను, రైతుకూలీలను, వ్యవసాయ అనుబంధ సంస్థలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

– కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి
వెల్దండ: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వెల్దండ మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను, రైతుకూలీలను, వ్యవసాయ అనుబంధ సంస్థలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే వారి సమస్యలపై చర్చించడానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హమీలను తుంగలో తొక్కిందన్నారు. రైతుల రుణాలు రెండు విడతలో మాఫీ చేసి చేతులు దులిపేసుకుందన్నారు. కాంగ్రెస్‌ రైతులకు అండగా ఉండి పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ బ్లాక్‌ అధ్యక్షుడు కడారి కష్ణయ్య, మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, ఎస్సీసెల్‌ అధ్యక్షుడు నారాయణ, కిసాన్‌సెల్‌ మండల అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి, తిర్పతిరెడ్డి, మోతిలాల్, సర్పంచ్‌ ముత్యాలు, యూత్‌కాంగ్రెస్‌ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌యాదవ్, శేఖర్, నాయకులు యాదగిరి, పుల్లయ్య, జంగయ్య, రాజు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement