చంద్రబాబు మీటింగ్లో మైకు విసిరిన మాగంటి | maganti babu fires on police in chandrababu meeting | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మీటింగ్లో మైకు విసిరిన మాగంటి

Apr 13 2016 4:59 PM | Updated on Aug 14 2018 11:26 AM

చంద్రబాబు మీటింగ్లో మైకు విసిరిన మాగంటి - Sakshi

చంద్రబాబు మీటింగ్లో మైకు విసిరిన మాగంటి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న సమావేశం రసాభాసగా మారింది.

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న సమావేశం రసాభాసగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా కుక్కనూరు మండలం ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు.

చంద్రబాబు పాల్గొన్న సమావేశంలో వేదికపైకి రాకుండా జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను పోలీసులు అడ్డుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. తమను స్టేజీపైకి రానివ్వకపోవడాన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు జీర్ణించుకోలేకపోయారు. పోలీసుల తీరును తీవ్రంగా నిరసిస్తూ ఎంపీ మాగంటి బాబు మైక్ విసిరేశారు.

Advertisement
 
Advertisement
Advertisement